మంచిర్యాల జిల్లా.
జీవో నం 49 రద్దు చేయాలని తుడుందెబ్బ డిమాండ్.
కుంరం భిం ఆదివాసి భవన్ ఆసిఫాబాద్ కేంద్రంగా జీవో నం 49 రద్దు చేయాలని రౌండ్ టేబుల్ సమావేశంలో అన్ని సంఘాల అభిప్రాయ సేకరణ.జీవో నం 49 ను చేయడమే లక్ష్యంగా భవిష్యత్ కార్యచరణ ప్రణాళికను సిద్ధం.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కొమరం భీమ్ ఆదివాసి భవనంలో నేడు జరిగిన ఆదివాసి సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో జీవో నెంబర్ 49 ను రద్దు చేయట గురించి సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ ప్రణాళికను ఆదివాసి సంఘ నాయకులు సిద్దం చేయడం జరిగింది.
1) రేపటి నుంచి తేదీ 06.07.2025.నుండి 13.07.2025.వరకు ఉమ్మడి జిల్లాలోని ప్రతి గ్రామంలో గ్రామ సభా సమావేశాలు నిర్వహించి జీవో నం 49 గురించి అవగాహన కల్పించాలి.
2) తేదీ 14.07.2025 పోమవరం రోజున ప్రతి మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం లో మరియు *ఫారెస్ట్ రేంజ్ అపిస్*లో ధర్నా నిర్వహించి తీర్మానాల జిరాక్సలను సమర్పించడం.
3) మంచిర్యాల జిల్లా లోని వన మహుత్సవం పేరుతో ఆదివాసులు పోడు వ్యవసాయం చేస్తున్న భూములలో ఫారెస్ట్ అధికారులు జెసిపి తో కండకాలు తవ్వడం ఫెన్నింగ్ చేయండి వంటి చర్యలను నిలిపివేయాలి.
