రామగుండం పోలీస్ కమీషనరేట్
రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా కు ఉత్కృష్ట సేవా పతకం
పోలీస్ శాఖలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు కేంద్ర ప్రభుత్వం అందజేసే ఉత్కృష్ట సేవా పతకానికి రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా గారు ఎంపికైనారు. 2009 ఐపిఎస్., బ్యాచ్ కి చెందిన సీపీ వివిధ హోదాలలో సుదీర్ఘకాలం వృత్తిపరమైన నైపుణ్యంతో విధులు నిర్వర్తించినందుకు గాను ఉత్కృష్ట సేవా పతకానికి ఎంపికైన రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా కి అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపినారు.
