సెస్ ను ట్రాన్స్ కో లో విలీనం చేయండి.
పై అంతస్తులో అన్ని గదులు ఉండగా ఆ గదిలోనే ప్రమాదం ఎందుకు జరుగుతుంది? సిరిసిల్ల జిల్లాలో లక్షల మంది వినియోగదారులు ఉన్న సెస్ లో దీపావళి పండుగ పూట అగ్ని ప్రమాదము జరగడం ముమ్మాటికీ కావాలని చేసిందే అని ఎల్లారెడ్డి పేట మాజీ ఎంపీటీసీ,కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ అన్నారు.మంగళవారం మండల కేంద్రము లో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఇటీవల నూతనంగా కొలువుదీరిన సెస్ పాలకవర్గం జిల్లా వ్యాప్తంగా ఉన్న 13 మండలాలకు సంబందించి మొత్తం 96 ట్రాన్స్ ఫార్మర్స్ కొనుగోలు చేసిందనీ అంటే కాకుండా కొత్తగా వేసిన విద్యుత్ స్తంభాల,ఇతర సామాగ్రి కొనుగోలు చేసిన ఫైల్స్ ఉన్న గది మాత్రమే ఎలా దగ్దం అవుతుందనీ అనుమానాలు కలుగుతున్నాయి అని అన్నారు. సెస్ పై అంతస్తు గదిలో ఆన్ని గదులు ఉన్నప్పటికీ కేవలం రికార్డులు ఉన్న గది మాత్రమే దగ్దం కావడం ఏమిటని కేవలం ఇది కావాలని చేసిన చర్యగా భావిస్తున్నామని అన్నారు.చివరకు షార్ట్ సర్క్యూట్ చర్య వల్లే రికార్డులు దగ్ధమయ్యాయని తప్పుడు రిపోర్ట్ బయట పెట్టాలని సెస్ పాలకవర్గం చూస్తుందని బాలరాజు యాదవ్ ఆరోపించారు.వారం రోజుల లోపు ఆడిటింగ్ ఉండగా ఫైల్స్ ఎలా దగ్దం అవుతాయనీ,మరి దగ్దం అయ్యేది ఉంటే ఆడిటింగ్ సమయం రాకముందు ఎందుకు దగ్దం కాలేదని అన్నారు.ఒకవేళ టపాసులు కాల్చడం వల్ల అగ్ని ప్రమాదము జరిగితే సెస్ కార్యాలయం రెండవ అంతస్తుకు మొదటి అంతస్తుకు మధ్య అడ్డం భీం ఉందని దీపావళి పండుగ సందర్భంగా కార్యాలయానికి సెలవు దినం కాగ రెండవ అంతస్తు గదిలో మంటలు ఎలా చెలరేగుతాయని బాలరాజు యాదవ్ అనుమానాలు వ్యక్తం చేశారు.సెస్ పాలకవర్గం ఇట్టి సంఘటనకు భాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.జరిగిన సంఘటన లో సెస్ వినియోగదారులను పక్కదోవ పట్టించడానికి ఎవరో ఒక ఉద్యోగిని బలి చేయాలని చూస్తున్నారని అన్నారు.సెస్ కు పాలక మండలినీ రద్దు చేసి ట్రాన్స్ కో లో విలీనం చేయాలని అలా చేయడం వల్ల సెస్ కు ఉన్న కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం కాదని ఒగ్గు బాలరాజు యాదవ్ అన్నారు.ఈ విలేఖరుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గౌస్ బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు దొమ్మటి నర్సయ్య ,జిల్లా కిసాన్ సెల్ నాయకులు మర్రి శ్రీనివాస్ రెడ్డి,జిల్లా మైనార్టీ సెల్ అద్యక్షులు సాహెబ్,మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు రఫిక్ ఉన్నారు.




