దండేపల్లి మండలం తాళ్లపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బిఆర్ఎస్ పార్టీలో చేరిక.
మంచిర్యాల జిల్లా.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలం అవుతుండటం, రేవంత్ రెడ్డి పరిపాలన తీరు బాగా లేకపోవడంతో దండేపల్లి మండలం తాళ్లపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు 1.సేదం బాపు, 2.ఎదుల బుచ్చన్న, 3.మారునేని చిన్న బిఆర్ఎస్ పార్టీ లో చేరడం జరిగింది.
ఈ రోజు మంచిర్యాల జిల్లా కేంద్రం లోని వారి నివాసం వద్ద వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మరియు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్.





