మంచిర్యాల జిల్లా.
డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయం 18 జూన్ 2025
మంత్రి బాధ్యతలు స్వీకరించిన చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి.
తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీలు, మైనింగ్, జియాలజీ శాఖ మంత్రిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన చెన్నూర్ ఎమ్మెల్యే డా. గడ్డం వివేక్ వెంకటస్వామి, ఈరోజు కుటుంబ సమేతంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, తన మినిస్టర్ ఛాంబర్ నం. 20, 21 & 22 లో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి, ఎమ్మెల్యే నాగరాజు, చెన్నూరు నియోజకవర్గానికి చెందిన పలు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని మంత్రి కి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ రోజుతోనే అధికారిక పనులకు శ్రీకారం చుట్టిన వివేక్ వెంకటస్వామి, రాష్ట్రంలోని కార్మిక వర్గ అభ్యున్నతితో పాటు, ఉపాధి అవకాశాల సృష్టిని లక్ష్యంగా తీసుకుని, పారదర్శకమైన పాలన అందిస్తానని తెలియజేశారు.
