మంచిర్యాల జిల్లా.
కొత్తగా భూమి కొన్న వారికి రైతు భరోసా. ఎల్లుండి వరకు చాన్స్ ఉంది.
కొత్తగా వ్యవసాయ భూమిని కొన్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వనున్నది. దీనికి సంబంధించి కొత్తగా కొన్న వ్యవసాయ భూమి జూన్ 5 లోపు రిజిస్ట్రేషన్ అయి ఉండాలి దానికి సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకం మరియు ఆధార్ కార్డు, బ్యాంకు బుక్ ఈనెల 20 లోపు సంబంధిత వ్యవసాయ అధికార ఆఫీసులో డాక్యుమెంట్ సబ్మిట్ చేసి రైతు బధు పొందవలసిందిగా తెలంగాణ ప్రభుత్వం రైతులకు సూచించింది. ఇప్పటికే 51.7 లక్షల రైతు ఖాతాలలో రూపాయలు 3092 కోట్ల రూపాయలను రైతు ఖాతాల జమ చేయడం జరిగింది.
