మంచిర్యాల జిల్లా.
నస్పూర్ అంగడివాని కేంద్రంలో యోగా అవగాహన కార్యక్రమం.
ఈరోజు అంతర్జాతీయ యోగా ఉత్సవ సందర్భంగా నస్పూర్ పట్టణంలోని అంగన్వాడి కేంద్రం అక్కడ ఉన్న మరియు అంగన్వాడీ టీచర్స్ మరియు చుట్టూ ఉన్న కమ్యూనిటీ వ్యక్తులకు అంగన్వాడి కేంద్రం వద్ద నస్పూర్ గ్రామంలో వారికి యోగా అంటే ఏంటి యోగాలో ఆసనాలు ఎలా ఉంటాయి ప్రణయము ఏ విధంగా చేయాలి ధ్యానం ఏ విధంగా చేయాలి వారికి ప్రాణయామ ధ్యానం చేపించడం జరిగింది. మరియు అంగన్వాడి కేంద్రంలోని ప్రెగ్నెన్సీ వారికి నార్మల్ ప్రెగ్నెన్సీ కావాలంటే ఎలాంటి యోగ ఆసనాలు వేయవలెను మరియు ఎలాంటి ప్రాణయామాలను చేయవలెను మరియు ధ్యానం ఏ విధంగా చేయాలి వారికి నేర్పించడం జరిగింది అదేవిధంగా నార్మల్ డెలివరీ అయ్యేవిధంగా ఇలా రోజు యోగా చేసుకున్నట్లయితే మీకు నార్మల్ డెలివరీ అనేది అవుతుంది దీని ద్వారా భవిష్యత్తులో మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు అనేవి కాకుండా ఉండడానికి తోడ్పడుతాయి మరియు మనం భవిష్యత్తులో మీరు ఆరోగ్యంగా ఉండడానికి మరియు రేపు జన్మించే పిల్లలకు వారికి కూడా ఎంతో ఆరోగ్యవంతమైన పిల్లలుగా జన్మిస్తారు వారికి కూడా ఎలాంటి సమస్యలు అనేటివి రాకుండా ఉండడం కోసం ముందుగానే ఇలాంటి యోగ ప్రాణహిమ ధ్యానం చేసినట్లయితే అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు అని చెప్పి తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆయుష్ యోగా ఇన్స్పెక్టర్ ఏసుదాకర్ మరియు ఆయుష్ మెడికల్ ఆఫీసర్ పద్మజ మరియు అంగన్వాడీ టీచర్ మరియు ఆశా వర్కర్స్ మరియు ఆ చుట్టుప్రక్కల వ్యక్తులు అందులో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.
