తడ్కల్ లో అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
చిన్న పెద్దలకు మంత్రముగ్ధులను చేసిన బతుకమ్మ పాటలు
అక్టోబర్ 22
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ లో ఆదివారం అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుక సంబరాలు అంబరాన్ని అంటాయి.ఈ సందర్భంగా ఆడపడుచులు మాట్లాడుతూ ప్రకృతిని ఆరాధిస్తూ,పూలను పూజిస్తూ,తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బతుకమ్మ పండుగను ఆడబిడ్డలంతా ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ అని అన్నారు.విశ్వానికి భూమాత అందం,
భూమాతకు ప్రకృతి అందం,ప్రకృతికి పూలు అందం,పూలకి స్త్రీలు అందం,స్త్రీలకు పూలు కలిసిన బతుకమ్మ అందం,బతుకమ్మను కనులారా చూడడం మహా ఆనందం, ఎంగిలిపూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు ఆడపడుచుల ఆనందంతో ఉప్పొంగి పోతారని అన్నారు.
తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి,ఆటపాటలు, కోలాటాలతో ఆడబిడ్డలు ఆనందంగా జరుపుకొనే తెలంగాణ సాంస్కృతిక వారసత్వ వైభవం బతుకమ్మ పండుగ అని అన్నారు.గౌరమ్మ ఆశీస్సులు నిరంతరం ఉండాలని గౌరమ్మకు పూజలు చేసి ఆనవాయితీగా వేడుకుంటామని అన్నారు.
