పెద్దపల్లి జిల్లా.
మంత్రి వివేక్ వెంకటస్వామి కి ఘన స్వాగతం.
పెద్దపల్లి మండలంలోని పెద్దకల్వల మరియు అందుగులపల్లి గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర గనులు, కార్మిక శాఖ మంత్రి డా. వివేక్ వెంకటస్వామి కి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా పూలతొరణాలు, గజమాలతో ప్రత్యేక అభినందనలు తెలిపి, ప్రజల మధ్యకు వచ్చిన మంత్రివర్యులను కార్యకర్తలు సన్మానించారు.
