శ్రీరేణుకఎల్లమ్మ దేవి విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం డివిజన్ లోని మల్లారెడ్డి నగర్ లో ఈరోజు జరిగిన శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపనలో ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు ముఖ్య అతిధిగా హాజరై పూజలు చేశారు. దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్సీ గారు అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ, సంక్షేమ సంఘం సభ్యులు, పార్టీ శ్రేణులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.*
