18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా తప్పక నమోదు చేయండి
మండల్ రెవెన్యూ అధికారి
మధిర 21 డిసెంబర్
స్థానిక టీవీఎం స్కూల్లో మండల పరిధిలోని బూత్ లెవెల్ ఆఫీసర్లకు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ 2024 పై శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ శిక్షణ కార్యక్రమంలో ఎమ్మార్వో మాట్లాడుతూ ది 1-1- 2024 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఫామ్ 6 ద్వారా ఓటరుగా నమోదు చేయాలని అలాగే చనిపోయిన వారిని ఫామ్ 7 ద్వారా డిలీట్ చేయాలని మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే ఫామ్8 ద్వారా సరిచేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమం 20-12-2023 నుండి 5-1-2024 వరకు కొనసాగుతుందని తెలిపారు ప్రతి బూత్ లెవల్లో
బూత్ ఆఫీసర్స్ అందరినీ అవగాహన పరుస్తూ పటిష్టమైన ఎలక్ట్రోరల్ రోల్ ను సిద్ధం చేయాలని తెలిపారు.
డిప్యూటీ తహసిల్దార్ రాజేష్ మాట్లాడుతూ బూత్ లెవెల్ లో ఎవరూ కూడా 18 సంవత్సరాలు నిండి ఓటరుగా అప్లై చేయకుండా మిగిలిపోకూడదని మరియు విదేశాలలో ఉండి ఓటరుగా ఫామ్ 6ఏ ద్వారా అప్లై చేసుకోవచ్చు అని తెలిపారు. ఎన్నికల డిప్యూటీ తాసిల్దార్ డేవిడ్ కరుణాకర్ మాట్లాడుతూ ఈ శిక్షణ కార్యక్రమంలో తెలుసుకున్న అన్ని అంశాలను ఈ 15 రోజులలో తప్పక అమలు జరిగేలా చూడాలని తెలియజేశారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో ఆఫీసు సిబ్బంది మరియు ఆర్ ఐ కృష్ణ ,భానుప్రకాష్,మురళి, రాజశేఖర్,వాసు, సాయి ఎఎల్ఎంటి ఆర్పీలు జల్లా విశ్వనాథం మహమ్మద్ జమీర్ లు పాల్గొన్నారు. ఎఎల్ఎంటి ఆర్పీలు మాట్లాడుతూ ఎస్.ఎస్.ఆర్ 2024లో కటాఫ్ డేట్ ను 01-01-2024 గా తీసుకోవడం జరుగుతుందని తెలిపారు
