ప్రాంతీయం

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యం

13 Views

మంచిర్యాల జిల్లా.

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యం – రఘునాథ్ వెరబెల్లి.

రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మంచిర్యాల పట్టణంలో FCA ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన జాబ్ మేళాలో మంచిర్యాల జిల్లా నుండి 200 మందికి పైగా డిగ్రీ మరియు ఇంటర్మీడియట్ చదువుకున్న యువతీ యువకులు పాల్గొనడం జరిగింది. ఈ జాబ్ మేళాలో హైదరాబాద్ కు చెందిన MSN ఫార్మా, ITC మరియు న్యూ ల్యాండ్ సంస్థల సంస్థల ప్రతినిధులు పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహించి యువతను ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరిగింది. మంచిర్యాల జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని రఘునాథ్ వెరబెల్లి కోరారు. రానున్న రోజుల్లో మరిన్ని జాబ్ మేళాలు నిర్వహించి యువతకు మరిన్ని ఉద్యోగాలు కల్పించడానికి కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, పెద్దపల్లి పురుషోత్తం, ఎనగందుల కృష్ణ మూర్తి, జోగుల శ్రీదేవి, అమిరిశెట్టి రాజ్ కుమార్, బోయిని హరి కృష్ణ, బింగి సత్యనారాయణ, మెరెడికొండ శ్రీనివాస్, చిరంజీవి మరియు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్