ప్రపంచదేశాలు హిందూ సనాతన ధర్మాన్ని గౌరవిస్తున్నాయి
సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ దేవాలయం పై జరిగిన దాడికి నిరసనగా గజ్వేల్ హైందవ సోదరుల ఆధ్వర్యంలో జైశ్రీరాం నినాదాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత, శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు పాల్గొని మాట్లాడుతూ హిందూ దేవతల జోలికి, హిందువుల జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. హిందూ సనాతన ధర్మం ఎంతో గొప్పదన్నారు. ప్రపంచ దేశాలు సైతం హిందూ ధర్మాన్ని గౌరవిస్తున్నాయన్నారు.
ఈ కార్యక్రమంలో గోలి సంతోష్, జంగం సోమేశ్, గంగిశెట్టి వెంకటేశం, ఉమేష్, భాస్కర్, గందే రమేష్ పాల్గొన్నారు.
