ఈవీఎం గోదాంను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 6, తెలుగు న్యూస్ 24/7
సిద్దిపేట జిల్లా,జిల్లా కలెక్టర్ కె. హైమావతి కలెక్టరేట్ పక్కనగల ఈవీఎం గోదాంను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నెలవారీ పరిశీలనలో భాగంగా గోదాంను పరిశీలించారు. లాగ్ బుక్ చెక్ చేసి విజిటర్స్ రిజిస్టర్ లో సంతకం చేశారు. ఎలక్షన్ కమిషన్ ఆప్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం చుట్టు సిసి కెమెరాల పనితీరు, పోలిస్ అధికారులు 24/7 గట్టి బందోబస్తు ఏర్పాటు అలాగే రెవెన్యూ అధికారులు తరుచు గోదాం పరిసర ప్రాంతాన్ని పర్యవేక్షణ చెయ్యాలని సూచించారు.





