నువ్వెంత నీ బతుకెంత నిన్ను ఇక్కడే చెట్టు కట్టేసి కొడతా హెచ్ఎంఎస్ యూనియన్ బ్రాంచ్ సెక్రటరీ బండారి క్రాంతి కిరణ్.
మనస్థాపానికి గురైన ఫోర్ మెన్ రామ్.
నేను లీడర్ ను నేను చెప్పేది వినాలి. నేను చెప్పింది చేయాలి లేకుంటే నువ్వెంత నీ బతుకెంత నిన్ను ఇక్కడే చెట్టు కట్టేసి కొడతా అంటూ డ్యూటీ టైం లో తాగి వచ్చి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి దుర్భాషలాడుతూ ఫోర్ మెన్ రాము ని అవమానించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది…. కథనం లోకి వస్తే బండారి క్రాంతి కిరణ్ అనే సింగరేణి ఉద్యోగి జనరల్ మస్దురుగా ఏ ఎల్ పి,ఏపీ ఏ, అడ్రియాల లాంగ్వాజ్ ప్రాజెక్టు గనిలో పనిచేస్తున్న హెచ్ఎంఎస్ యూనియన్ లో బ్రాంచ్ సెక్రటరీగా పోస్టులో ఉన్నాడు. రెండు వారాల క్రితం ఒక ప్లేడే రోజున నైట్ షిఫ్ట్ విధులు నిర్వహిస్తున్న ఫోర్ మెన్ డిస్ట్రిబ్యూషన్ చేయుచుండగా వచ్చి కార్మికుల సమస్య గురించి మాట్లాడుతా అన్నాడు దాంతో సదరు ఫోర్ మెన్ డిస్ట్రిబ్యూషన్ అయ్యాక మాట్లాడదాం అన్నాడు అయినా వినకుండా నేను లీడర్ ని వచ్చాను నాతో మాట్లాడకుండా డిస్టిబ్యూషన్ ఏంటి అనడంతో ఆ ఫోర్ మెన్ చెప్పు భయ్యా అన్నాడు. ఆ మాటతో ఏంటి బై నేను లీడర్ ను అంటే నన్ను భయ అంటావా నువ్వు ఏమన్నా నా బామ్మర్ది వా? అంటూ దుర్భాషలాడుతూ నిన్ను ఇక్కడే చెట్టు కట్టేసి బట్టలు ఊడదీసి కొడతా నువ్వు ఎంత నీ బతుకెంత అంటూ ఇష్టం వచ్చినట్టు చెప్పరాని మాటలు అనరాని మాటలతో ఫోర్ మెన్ రాముని అవమానించారు ఇట్టి సంఘటనపై గని యాజమాన్యాము దృష్టికి తీసుకువెళ్లి ఫిర్యాదు చేయగా ఎటువంటి చర్య తీసుకోకపోగా మధ్యవర్తిత్వం చేసి కాంప్రమైజ్ కమ్మని సలహా ఇచ్చారు దీంతో తీవ్రమైన మనస్థాపానికి గురైన ఫోర్ మెన్ రాము 19.05.2025 సోమవారం రోజు సాయంత్రం 7:30 గంటలకు రియాజ్ అహ్మద్ జనరల్ సెక్రెటరీ హెచ్ ఎం ఎస్ కి న్యాయం చేయాలని కోరారు. జరిగిన ఘటన తెలుసుకుని ఇట్టి ప్రవర్తనకు యూనియన్ లో తావు లేదని సత్వరమే విచారణ కమిటీ వేస్తామని కమిటీ నివేదిక అందిన తర్వాత తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
