ప్రాంతీయం

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలి

90 Views

* జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలి *

* ఎమ్మార్వో కు వినతి పత్రం అందజేసిన డీజే ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు *

పెద్దపల్లి జిల్లా దర్మారం మండల ఎమ్మార్వో అంబటి రజిత కు అక్రిడేషన్ లతో సంబందం లేకుండా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డెమోక్రటిక్ జర్నలిస్టు ఫెడరేషన్ దర్మారం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గుండేటి సత్తయ్య ఆధ్వర్యంలో ఎమ్మార్వో కు వినతి పత్రం అందించారు. ఇంటి స్థలంతో పాటు విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు స్కూల్ లలో చదువుతున్న జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో రాయితీ ఇవ్వాలని,అక్రమ కేసుల నుండి రక్షణ కలిగించాలని ఎమ్మార్వో కు ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు గుండేటి సత్తయ్య , ప్రధాన కార్యదర్శి ఏదుల్ల ప్రభాకర్,ఉపాధ్యక్షులు తాళ్ళ మధుకర్ గౌడ, మూల దిలీప్ గౌడ్,కోశాధికారి బెక్కం హరి కృష్ణ,సహాయ కార్యదర్శి పిట్టల స్వరూప రాణి,కార్యవర్గ సభ్యులు బచ్చలి నర్సయ్య, పాంచాల శ్రీధర్, ఆడిశర్ల రాకేష్, పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found