మంచిర్యాల జిల్లా.
బీసీ పల్లెబాట యాత్రని విజయవంతం చేద్దాం : బీసీ జే.ఏ.సీ నాయకులు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో రేపు అనగా 10-05-2025 ఆదివారం రోజున జరగబోయే గ్రామ, గ్రామీన జాగృతికై మేమెంతో.. మాకంత పల్లేబాట యాత్రను విజయవంతం చేయాలని బీసీ జే.ఏ.సీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ…. బిసి ఆజాది ఫెడరేషన్ ఆధ్వర్యంలో జాతీయా అధ్యక్షుడు జక్కని సంజయ్ కుమార్ గ్రామ,గ్రామీన జాగృతికై మేమెంతో.. మాకంత పల్లేబాట యాత్రను గత కొన్ని రోజుల క్రితం కొండ లక్ష్మణ్ బాపూజీ స్వగ్రామమైన వాంకిడి,అసిఫాబాద్ జిల్లా నుంచి ప్రారంభించడం జరిగింది. యాత్ర రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల వారీగా తిరుగుతూ బీసీ సబ్బండ వర్గాలను ఒకటి చేసి సభలను, రౌండ్ టేబుల్ సమావేశాలను, ర్యాలీలను నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా అయొక్క యాత్ర రేపు అనగా 11-05-2025 ఆదివారం రోజున మంచిర్యాల పట్టణానికి చేరుకోవడం జరుగుతుంది, ఆ యాత్రకు స్వాగతం తెలిపి, సాయంత్రం 4:00PM గంటలకు మంచిర్యాల పట్టణంలోని బస్టాండ్ నుంచి ఐ.బి చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున,ఈ యొక్క గ్రామ,గ్రామీన జాగృతికై మేమెంతో.. మాకంత పల్లేబాట యాత్ర కార్యక్రమానికి జిల్లాలో ఉన్న విద్యార్థిని, విద్యార్థులు,రాజకీయ నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు,కవులు,కళాకారులు,ప్రజా సంఘనాయకులు,ప్రజాప్రతినిధులు బీసీ కుటుంబ సభ్యులు,బీసీ మద్దతుదారులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ నాయకులు పరికిపండ్ల అశోక్,వడ్డేపల్లి మనోహర్, గుమ్ములశ్రీనివాస్,విద్యార్థి నాయకులు చేరాల వంశీ,హరీష్ గౌడ్, బీసీ జిల్లా నాయకులు గజ్జలి వెంకన్న, బీసీ యువజన నాయకులు లతీఫ్, ఎర్రోళ్ల రాజు,సందీప్ మరియు తదితరులు పాల్గొన్నారు.
