ప్రాంతీయం

మంచిర్యాల టచ్ హాస్పిటల్లో గుండెకు అరుదైన వైద్యం

18 Views

మంచిర్యాల జిల్లా.

మంచిర్యాల టచ్ హాస్పిటల్ లో గుండెకు అరుదైన చికిత్స చేసిన కార్డియాలజిస్ట్ డాక్టర్ రాజేష్.

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జన్మభూమి నగర్ లో నీ టచ్ హాస్పిటల్లో గుండెకు అరుదైన చికిత్స చేసిన టచ్  హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ బి రాజేష్ మరియు టచ్ ఆస్పటల్ వైద్య బృందం.

నేడు పేషెంట్ సరోజ తీవ్రంగా ఛాతీలో నొప్పుతో హాస్పిటల్ కు రావడంతో డాక్టర్ రాజేశ్. బి (కార్డియోలాజిస్ట్) మరియు వైద్య బృందం పరీక్షలు జరిపి పేషెంట్ కి హార్ట్ఎటాక్ వచ్చిందని నిర్ధారణ చేశారు వెంటనే బంధువులకు చెప్పి ఆంజియోగ్రాం పరీక్ష చేయగా దానిలో గుండెలోని మెయిన్ రక్త నాళంలో మొదటి భాగంలో 95% బ్లాకేజ్ ఉండడం జరిగింది. దానిలో స్టంట్ వెయ్యడం చాలా కష్టం మామూలుగా ఓపెన్ హార్ట్ సర్జరీ కి పంపిస్తారు. కానీ మన టచ్ హాస్పిటల్ లో IVUS కెమెరా గైడింగ్ అనే అధునాతనమైన చికిత్స ద్వారా సర్జరీ లేకుండా స్టంట్ వేయడం జరిగింది, దానితో పేషెంట్ మరియు పేషెంట్ బంధువులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

కార్డియోలాజిస్ట్ డాక్టర్ రాజేశ్ .బి మరియు హాస్పిటల్ యాజమాన్యం మాట్లాడుతూ హార్ట్ఎటాక్ పేషెంట్లకి సమయం ఎంతో విలువైనదని దానిని వృథా చేయకుండా ఇలాంటి అధునాతనమైన వైద్య సేవలు కోసం దూర ప్రాంతాలకి వెళ్లవలసిన అవసరం లేదని మన టచ్ హాస్పిటల్ మంచిర్యాలలో అన్ని రకాల అధునాతనమైన వైద్య సేవలు ప్రజలందరూ ఉపయోగించుకోవాలని తెలిపారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్