మంచిర్యాల జిల్లా.
కేంద్ర ప్రభుత్వం జనగణ లో కులగన చేయడం ఒక చారిత్రిక ఘట్టం. బీసీలు రాజ్యాధికారం వైపు కొనసాగాలి.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో అర్చన టెక్స చౌరస్తా నందు జన గణనలో కులగన చేస్తున్న భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ కి, మరియు మా బీసీ ఆరాధ్య దైవమైన మహాత్మ జ్యోతిరావు పూలే, బీపీ మండల్, సాహు మహారాజ్ కి పూలభిలాభిషేకం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా బీసీ జేఏసీ జిల్లా అధ్యక్షులు ఒడ్డేపల్లి మనోహర్, బీసీ ఆజాది ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షులు జక్కని సంజయ్ మాట్లాడుతూ, కేంద్రమంత్రివర్గానికి కుల గణాంకాల పరిశీలనకు ఆమోదం తెలిపినందుకు ధన్యవాదాలు, కుల గణాంకాలను చేపట్టేందుకు కేంద్రమంత్రివర్గం తీసుకున్న చారిత్రక నిర్ణయానికి గుండెతట్టు ధన్యవాదాలు తెలుపుతున్నాము. దేశంలోని సామాజిక న్యాయం, సమానత్వానికి ఇది ఒక కీలక మెట్టు. కుల గణాంకాల ద్వారా దేశంలోని వాస్తవిక సామాజిక వర్గాల పరిస్థితిని సమగ్రంగా అర్థం చేసుకునే అవకాశం లభిస్తుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన ప్రజల జనాభా, జీవన స్థితిగతులు, విద్యా, ఉద్యోగ అవకాశాలలో వారి స్థితి తదితర అంశాలపై స్పష్టత కలుగుతుంది. ఇది ప్రజాస్వామ్యంలో సమానవకాశాల కోసం ఒక బలమైన సాధనంగా మారుతుంది.ఓబీసీ వర్గానికి ఇది ఎంతో అవసరమైన విజయం. గత ఎన్నో దశాబ్దాలుగా ఓబీసీ వర్గాలు తమ జనాభా మేరకు హక్కులు పొందాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రిజర్వేషన్లు, విద్యా, ఉద్యోగాల్లో సమానవకాశాలు లభించాలని డిమాండ్ చేస్తూ వచ్చాయి. కానీ స్పష్టమైన గణాంకాల లేకపోవడం వల్ల ఆ డిమాండ్లకు పునాది లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో కుల గణాంకాలను ఆమోదించడం ఓబీసీల న్యాయమైన పోరాటానికి అండగా నిలుస్తుంది.ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రాధాన్యతనిచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారికి, కేంద్రమంత్రివర్గ సభ్యులకు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ అగ్ర నేత రాహులు గాంధీ గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే గతంలో నుంచీ కుల గణాంకాల కోసం పోరాడుతున్న సామాజిక న్యాయ నేతలు,బీసీ నాయకులకు, విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలు మరియు ప్రజాసంఘాలను కూడా మనస్పూర్తిగా అభినందిస్తున్నాము.కుల గణాంకాలను పూర్తి పారదర్శకతతో, సాంకేతిక పరంగా ఖచ్చితంగా నిర్వహించాలన్న డిమాండ్ చేస్తూ, దీనిని విజయవంతంగా పూర్తిచేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిపూర్ణ సహకారం అందించాల్సిన అవసరం ఉంది. కుల గణాంకాల ఫలితాలను ప్రజలతో పంచుకుంటూ, వాటి ఆధారంగా సంక్షేమ పాలనకు దారితీయాలని ఆశిస్తున్నాము.ఈ చారిత్రక నిర్ణయంతో, దేశంలో సమానత్వ సాధనకు బలమైన అడుగు పడిందని విశ్వసిస్తున్నాము. ఇది భవిష్యత్తు తరాలకి న్యాయంగా, సమగ్రంగా అభివృద్ధి చెందే మార్గాన్ని చూపిస్తుంది.
ఈ కార్యక్రమంలో రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుమార్ గాడ్గే,, స్థానిక బిజెపి బీసీ నాయకులు తుల మధుసూదన్ రావు , బీసీ మహిళా జేఏసీ,మంచిర్యాల జిల్లా కన్వీనర్ పేరo అలేఖ్య,గారు కో కన్వీనర్ కలికోట కవిత గారు బీసీ జేఏసీ జిల్లా నాయకులు గజ్జెల్లి వెంకన్న, అడ్వకేట్ కొట్టే నటేశ్వర్,, బీసీ విద్యార్థి నాయకుడు చేరాల వంశీ, స్థానిక బిజెపి నాయకులు మున్నారాజ్ సిసోడియా, గాజుల ప్రభాకర్, లింగన్నపేట విజయ్, బీసీ జేఏసీ జైపూర్ మండల అధ్యక్షులు వేములమల్లేష్,, మండల నాయకులు గుండు రాజేష్, కోమటి రాజు, బీసీ జేఏసీ యువజన నాయకులు పెద్దల చంద్రకాంత్, ఎండి లతీఫ్ తదితరులు పాల్గొన్నారు.
