Breaking News

హీరో మోహన్ బాబు మీడియాపై చిందులు లోగోలు లాక్కోండి అంటూ బౌన్సర్లకు ఆదేశాలు*

83 Views

*హీరో మోహన్ బాబు మీడియాపై చిందులు లోగోలు లాక్కోండి అంటూ బౌన్సర్లకు ఆదేశాలు*

సినీ హీరో కళాప్రపూర్ణ డాక్టర్ మంచు మోహన్ బాబు షాద్ నగర్ మీడియాపై కాసేపు చిందులు తొక్కారు. ఓ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో ఆయన గురువారం స్థానిక సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చారు. అయితే మోహన్ బాబు వచ్చిన విషయాన్ని తెలుసుకున్న స్థానిక మీడియా ప్రతినిధులు కొందరు కవరేజ్ కు వెళ్లారు. మీడియాను చూడగానే మోహన్ బాబు చిందులు తొక్కారు. ఆ లోగోలు లాక్కొండయ్యా అంటూ తన బౌన్సర్లకు సూచించారు. మీడియా ప్రతినిధులకు బుద్ధి లేదా? అంటూ తన నోటికి పని చెప్పారు.  సీనియర్ నటుడైన మోహన్ బాబు తన ఆస్తికి సంబంధించి వీలునామా కోసం వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం అందుతుంది. అయితే ఈ వ్యవహారం మీడియా దృష్టి పడకుండా ఆయన వ్యవహరించడంతో అక్కడ ఉన్నవారు ఏం జరుగుతుందోనని చూస్తూ ఉండిపోయారు. మీడియాపై చిందులు తొక్కిన వ్యవహారం, బౌన్సర్లు అత్యుత్సాహం ప్రదర్శించిన తీరు రాద్ధాంతం అయింది. అసలే మోహన్ బాబుకు ముక్కు మీద కోపం కదా..!

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *