సిద్దిపేట జిల్లా గజ్వేల్ కిరాణా వర్తక సంఘం ఆధ్వర్యంలో గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కాచారం గ్రామం రేణుక ఎల్లమ్మ దేవస్థానం వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామికి కిరాణా వర్తక సంఘం కార్యాలయంలో శాలువా కప్పి ఘన సన్మానం చేశారు ఈ సందర్భంగా నాచారం దేవస్థానం డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ మాట్లాడుతూ వంగపల్లి ఆంజనేయస్వామి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటూ ప్రజలను భక్తి మార్గం వైపు మళ్లీ విధంగా కృషి చేస్తున్నారని ప్రతి మంగళవారం రేణుక ఎల్లమ్మ దేవాలయంలో భక్తులకు అన్నదానం చేయడం గొప్ప విషయమని గజ్వేల్ రామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో కోటి గోటి తలంబ్రాలు గోటితో వడ్లను వలిచే కార్యక్రమం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వంగపల్లి అంజయ్య స్వామికి చిరు సన్మానం చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య, రజిత గౌడ్, రామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షుడు రామకోటి రామరాజు, కిరాణా వర్తక సంఘం అధ్యక్షులు సిద్ధి బిక్షపతి, సెక్రెటరీ మెట్ రాములు, కాపర్తి వైకుంఠం, మర్యాల శ్రీనివాస్, యాదగిరి, తోట బిక్షపతి, శ్రీహరి, దొంతుల సత్యనారాయణ, నోముల మహేందర్,సాయి, ఆర్యవైశ్య సంఘం మహిళ విభాగం, ఆర్యవైశ్య సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు