ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రాయపోల్ మండలంలోని అనాజిపూర్ గ్రామంలో ఎస్సీ మరియు బిసి యువకులను కలిసి పెరియార్ రామస్వామి జయంతిని నిర్వహించడం జరిగింది. ధర్మసమాజ్ పార్టీ మండల నాయకులు నందు మాట్లాడుతూ ఈ ప్రజల్ని ఎట్లా పరిపాలించాలి, వాళ్లకి పాఠశాలలో ఉదయం పౌష్టికాహారం ఎట్లా అందించాలి, ప్రజలకి వైద్యం ఎట్లా అందించాలి అనే విషయాలపై పెరియార్ వారసత్వం నుండి పుట్టిన “మంగలి ముఖ్యమంత్రి స్టాలిన్” దగ్గరకు “వెలమ ముఖ్యమంత్రి కేసీఆర్” తన ప్రతినిధి బృందాన్ని పంపాడు. అది పెరియర్ రామస్వామి అణగారిన కులాల ఉద్యమస్ఫూర్తి అంటే. అణగారిన వర్గాలైన బీసీ ఎస్సీ, ఎస్టీలకు పెరియర్ రామస్వామి స్ఫూర్తిదాయమని పేర్కొన్నారు.




