ప్రాంతీయం

భారత్ సమ్మిట్ లో పాల్గొన్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

30 Views

పెద్దపల్లి కాన్స్టెన్సీ.

పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ  హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్ లో ముఖ్యమైన పాత్రతో పాల్గొన్నారు.

ఈ సమ్మిట్‌లో రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, ఎంపీ సామల కిరణ్ , ఎమ్మెల్సీ వెంకట్  కూడా పాల్గొన్నారు. ఎంపీ గడ్డం వంశీ  సమ్మిట్ ఉద్దేశ్యాలను వివరిస్తూ, శాంతి, అహింస, ఆర్థిక సమానత్వం వంటి అంశాలపై చర్చలు జరిగే కీలక వేదికగా ఇది నిలుస్తుందని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలపై ఆధారపడి ఈ సమ్మిట్ నిర్వహించబడుతోందని ఆయన పేర్కొన్నారు.ప్రపంచవ్యాప్తంగా ఉన్న 100 దేశాలకు చెందిన 450 మంది ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరవుతుండటం గర్వకారణమన్నారు.తెలంగాణ రాష్ట్రం ఇలాంటి గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహించడం ఒక గొప్ప గౌరవమని ఎంపీ వ్యాఖ్యానించారు.
తెలంగాణ పేరు ప్రపంచ మ్యాప్లో నిలిపే ఈ కార్యక్రమంలో MP  విశేష ఆసక్తితో పాల్గొన్నారు. విదేశీ ప్రతినిధులతో సమావేశమై అభిప్రాయాలు పంచుకున్నారు.ఎంపీ గారు ఈ సమ్మిట్‌ వల్ల యువతకు ఆత్మవిశ్వాసం పెరిగి, అవకాశాలు విస్తరిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్