ప్రాంతీయం

వేసవి కాలంలో తల్లితండ్రులు మీ పిల్లల పట్ల జాగ్రత్త వహించాలి

27 Views

*రామగుండం పోలీస్ కమీషనరేట్*

వేసవి కాలంలో తల్లితండ్రులు మీ పిల్లల పట్ల జాగ్రత్త వహించాలి : ఇన్స్పెక్టర్ ఇంద్ర సేనా రెడ్డి

పాఠశాలలకు సెలవులు రావడంతో పిల్లల పట్ల తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత పనిలో ఉన్నా సరే పిల్లలపై ఓ కన్నేసి ఉండాలి. పిల్లల పట్ల అప్రమత్తంగా లేకుంటే ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. ప్రమాదం జరగకుండా ముందస్తుగానే జాగ్రత్తలు పాటించడం మంచిదని గోదావరిఖని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి గారు తల్లితండ్రులకు సూచించారు.

ఈరోజు నుండి పాఠశాలలకు వేసవి సెలవులు సందర్బంగా ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో స్కూల్ హెడ్ మాస్టర్ మల్లేశం ఆధ్వర్యంలో విద్యార్థని విద్యార్థుల తల్లితండ్రులతో ఏర్పాటు చేసిన సమావేశం లో గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి పాల్గొని ఈ సందర్భంగా తల్లిదండ్రులకు పలు సూచనలు జాగ్రత్తగా తెలియజేయడం జరిగింది.

పిల్లలను బావుల్లో, అలాగే చెరువుల్లో ఈత కొట్టేందుకు పంపించకండి..అవసరమైతే ఈత నేర్పించాలి అంటే మీరే స్వయంగా వారికి తోడుగా వెళ్లండి.

మైనర్ పిల్లలకు మోటార్‌సైకిల్ నడపమని వారి చేతికి తాళాలు ఇవ్వకండి. వారికి తాళాలు కనిపించకుండా ఉండేలా జాగ్రత్త తీసుకోండి.

మొబైల్ ఫోన్‌లు, ట్యాబ్‌లు వారి చేతికి ఇవ్వకండి. సోషల్ మీడియా వాడకం వలన ప్రమాదం లో పడే అవకాశం ఉంది. తెలియని వారు పంపిన మెసేజ్ లు, ఫోన్ కాల్స్, లింక్ లు ఓపెన్ చేసి సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయే అవకాశం ఉందన్నారు.

స్నేహితులతో కలిసి దూరప్రాంతాలకు పంపకండి. చేడు స్నేహితుల వలన చేడు అలవాట్ల కు బానిసలుగా మారి భవిష్యత్తు జీవితాలు నాశనం చేసుకొనే అవకాశం ఉందన్నారు.

మధ్యాహ్న సమయంలో ఆరుబయట ఆడుకోవడానికి అనుమతించకండి. ఉదయం మరియు సాయంత్రం వేళల్లో మాత్రమే ఆడుకోవడానికి వారికి అనుమతినివ్వండి.

ఇంట్లో పెద్దలతో వారు ఎక్కువ సమయం గడిపేలా చూడండి.

వీలైనంత వరకు పిల్లలను ఇంట్లోనే ఉంచుకుని మన సంప్రదాయాలను నేర్పించాలి.

సంప్రదాయ పనులు గురించి వారికి చెప్పాలి. ఇలా పైన పేర్కొన్న జాగ్రత్తలు పాటించినట్లయితే ఈ వేసవి సెలవులు ఇట్టే గడిచిపోతాయి.

సంప్రదాయ పనులు చెప్పాలి. పైన పేర్కొన్న జాగ్రత్తలు పాటిస్తే ఈ వేసవి సెలవులు ఇట్టే గడిచిపోతాయి అని సీఐ తల్లితండ్రులకు సూచించారు.

ఈ సమావేశం లో స్కూల్ టీచర్స్, తల్లితండ్రులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్