మంచిర్యాల జిల్లా.
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం మరియు పోషన్ పక్వాడ భాగంగా యోగా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది.
పోషన్ పక్వాడ భాగంగా గర్భిణీ స్త్రీలకు మరియు పిల్లలకు ప్రతిరోజు యోగ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. యోగా ద్వారా మరియు పోషణ ద్వారా పిల్లలకు సరియైన సంపూర్ణమైన ఆరోగ్యం అందజేయవచ్చని తెలియజేయడం జరిగింది. పిల్లల్లో బలహీనతలు ఏర్పడడం మరియు సమస్యలు రాకుండా ఉండడం కోసం పోషన్ పక్వాడ కార్యక్రమం ద్వారా పిల్లలను సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా చేయడం సమస్యలు రాకుండా ఉండడానికి భవిష్యత్తులో ఎలాంటి ఆందోళన గురికాకుండా ఉండడం కోసం యోగా ద్వారా గర్భిణీ స్త్రీలకు నార్మల్ డెలివరీ కావడానికి ఎలాంటి యోగ సాధనాలు చేయవలెను పిల్లల్లో ఎలాంటి పోషక ఆహారాలను తీసుకోవాలని అదేవిధంగా యోగ ఎలాంటి సాధనాలను చేయవలెను యోగా ద్వారా మనిషికి సంపూర్ణమైన మానసికమైన ఆందోళనకు గురికాకుండా శారీరకంగా మానసికంగా సంపూర్ణంగా శరీరాన్ని తయారు చేసుకోవచ్చని యోగ ద్వారా పిల్లలకు మరియు గర్భిణీ స్త్రీలకు మరియు అందరికీ కూడా యోగ అనేది చాలా ముఖ్యమని తెలియజేయడం జరిగింది మరియు పిల్లలకు యోగ ఆసనాలను శరీరకంగా మానసికంగా ఉత్తేజపరచుటకు యోగ లో భాగంగా కొన్ని ఆసనాలను ప్రాణయమాలను మెడిటేషన్ను యోగ కార్యక్రమాన్ని పిల్లలకు చేపించి చూపించడం జరిగింది. వీటి ద్వారా పిల్లలు గానీ పెద్దలు గానీ గర్భిణీలు కానీ మరెవరైనా కూడా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని తయారు చేసుకోవచ్చు అదేవిధంగా పోషకమైన ఫుడ్ను కూడా తీసుకున్నట్లయితే భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఉండవని యోగ టీచర్స్ మరియు ఆయుర్వేదిక ఆయుష్ డిపార్ట్మెంట్ డాక్టర్స్ మరియు అంగన్వాడీ టీచర్స్ మరియు డిపిఎమ్స్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఆయుష్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పద్మజ, డి పి ఎం రవి రాథోడ్, యోగా టీచర్స్ ఏ సుధాకర్ పి మేఘన కిషన్ మరియు పిల్లలు ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
