మంచిర్యాల జిల్లా.
మందమర్రి లో B1 పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.
మందమర్రి పట్టణంలోని B1 పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ కార్యాలయాన్ని చెన్నూర్ శాసనసభ్యులు డా. జి. వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి ఈ కార్యాలయం ఉపయోగపడుతుందని అన్నారు.ప్రజల మధ్య ఉన్నత రాజకీయ విధానాలను తీసుకురావాలనే లక్ష్యంతో B1 పార్టీ ముందుకు సాగుతుందని తెలిపారు.మందమర్రి ప్రాంత అభివృద్ధి, యువతకు అవకాశాలు కల్పించడమే తమ ప్రధాన ధ్యేయమని చెప్పారు.ప్రారంభోత్సవ కార్యక్రమానికి పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.కార్యాలయ నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
పార్టీ కార్యాలయం ద్వారా ప్రజల అభిప్రాయాలను ప్రతినిధుల వరకు చేరుస్తామని చెప్పారు.
