మంచిర్యాల జిల్లా
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్ మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించి తగు సూచనలు ఆదేశాలు జారీ చేయడం జరిగినది. హెల్ప్ డెస్క్ కేటాయించిన వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని రోగులు గర్భవతులు వారికి సేవలు అందించడంలో ముందుండాలని హై రిస్క్ గర్భవతులను వారి పూర్తి వివరములను నమోదు చేసుకున వైద్యులకు చేరవేయాలని ఆదేశించినారు ఓపీ సమయంలో గానీ ఇతర సమయంలో గానీ వచ్చిన వారితో స్నేహపూర్వకంగా ఉంటూ అడ్మిషన్ చేయించాలని అదేవిధంగా వారికి సంబంధించిన పరీక్షలు స్కానింగ్ మొదలైన వాటిని ఏ రూములు అందుబాటులో ఉండును తెలియజేయాలని కోరినారు. మాతా శిశు సంరక్షణ కేంద్రానికి వచ్చే ప్రజా ప్రతినిధులు గాని జిల్లా అధికారులు గాని ఇంకా ఏ పై అధికారులు వచ్చినా వారికి వివరములు అందజేస్తూ మాతా శిశు సంరక్షణ కేంద్రంలో అందిస్తున్న సేవలను తెలియజేయాలని ఆదేశించినారు. ఈ ఆకస్మిక సందర్శనలో భాగంగా మాతా శిశు సంరక్షణ కేంద్రంలో ప్రసవాలు సాధారణ ప్రసవాలు సిజేరియన్ ల పైన నర్సింగ్ ఆఫీసర్లతో సమీక్ష చేసినారు సీసీ కెమెరాలు 47 అందుబాటులో ఉండమని మరియు ప్రశ్నలకు వచ్చే గర్భవతులు ఇతరులు సమన్వయంతో ఉండాలని కోరినారు అందిస్తున్న వైద్య సేవల పైన సంతృప్తి వ్యక్తం చేసినారు.
ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు డాక్టర్ ప్రియదర్శిని నర్సింగ్ ఆఫీసర్లు డాక్టర్ ప్రసాద్ డాక్టర్ అనిల్ కుమార్ బుక్క వెంకటేశ్వర్ జిల్లా మాస్ మీడియా అధికారి వెంకట సాయి పాల్గొన్నారు.
