తెలంగాణలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీ ఎన్నికల కార్డుతో ముందుకు వెళ్తున్నట్లు . కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు. సోమవారం హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సతీసమేతంగా దసరా ఉత్సవాలను నిర్వహిస్తూ సెమీ పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు చెడును విడనాడి విజయం దిశగా పయనించాలని ఆయన ప్రజలను కోరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో గల మెట్టి వినిపించడానికి మీ అంత ధైర్యాన్ని నాకు నింపుతూ మీ బిడ్డగా ముందుకు వస్తున్నానని కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఈ ప్రాంత ప్రజల సమస్యల పోరాటం కోసం పాల్గొని అవకాశమిస్తారని ఆశిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
