అక్రమ అరెస్టులతో భయపడేది లేదు…
-బిజెపి మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు దాసరి పూర్ణిమ అరెస్ట్-
*తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ భూములను కాపాడేందుకే అక్రమ అరెస్టులకు నిర్బంధాలకు ప్రభుత్వం పాల్పడుతుందని ఎల్లారెడ్డిపేట మండల బిజెపి మోర్చా అధ్యక్షురాలు దాసరి పూర్ణిమ బుధవారం రోజున అసెంబ్లీ ముట్టడిని చేయడానికి వెళుతుండగా అసెంబ్లీ మార్గమధ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ తో పాటుగా మండల అధ్యక్షురాలను హైదరాబాదులోని రామ్ గోపాల్ పేట పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్లో వారిని నిర్బంధించారు. ఈ అరెస్టులు కాంగ్రెస్ నియంతృత్వపాలనకు పరాకాష్టగా ఉంటుందన్నారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) పరిసర ప్రాంతాల్లో వందలాది చెట్లు నరికివేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ అన్యాయాన్ని ప్రశ్నించేందుకు పూనుకున్న బీజేపీ మహిళా మోర్చా నాయకురాలను అరెస్ట్ చేయడం ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనంగా ఉంటుందన్నారు.చెట్ల నరికివేత, పర్యావరణాన్ని నాశనం చేస్తూ, ప్రశ్నించేవారిని అక్రమంగా అరెస్టు చేస్తున్న కాంగ్రెస్ వైఖరి కి , ఇది నిదర్శనమని చెబుతున్నారు.ఎమర్జెన్సీని తలపించే విధంగా చేస్తున్నారని మీడియాతో తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ,
ప్రధాన కార్యదర్శి కర్నే హరీష, పట్టణ అధ్యక్షురాలు వైశాలి, ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షురాలు దాసరిపూర్ణిమ ఉన్నారు.
