బీసీ రిజర్వేషన్లు 42 శాతం నుంచి 56 శాతానికి పెంచాలి
బీఎస్పీ సెంట్రల్ కోఆర్డినేటర్ నిసాని రామచంద్రం డిమాండ్
సిద్దిపేట, మార్చి 30
బహుజన్ సమాజ్ పార్టీ సిద్దిపేట జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా బీఎస్పీ సెంట్రల్ కోఆర్డినేటర్ నిసాని రామచంద్రం హాజరై సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లను 46% నుండి 56 శాతానికి పెంచి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన చిత్తశుద్ధిని చాటుకోవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ బిజెపి ప్రభుత్వాలు బీసీల వ్యతిరేక పార్టీలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ దేశంలో మొట్టమొదటిసారి బీసీల రిజర్వేషన్ల కోసం పోరాడిన వ్యక్తి బిఎస్పీ వ్యవస్థాపకులు మాన్యశ్రీ కాన్సిరాం అని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన 40 సంవత్సరాల తర్వాత బీసీలకు రిజర్వేషన్లు అమలు అయ్యాయని ఆయన అన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర బీఎస్పీ కార్యకర్తలతో సుమారు రోజు 15,000 మందితో సుమారు నెలరోజుల పాటు అప్పటి కేంద్ర ప్రభుత్వం విపీ సింగ్ పైన ఒత్తిడి తీసుకొచ్చి బీసీలకు రిజర్వేషన్లు తీసుకొచ్చిన వ్యక్తి వ్యవస్థాపకులు మాన్యశ్రీ కాన్షిరా అని తెలిపారు. బీసీల పక్షపాతిగా ఉన్న ఏకైక పార్టీ బీఎస్పీ పార్టీ మాత్రమే అని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. మహాత్మ జ్యోతిరావు పూలే, సంతు నారాయణ, సాహూ మహారాజ్, అంబేద్కర్ ఆలోచన విధాన్ని ముందుకు తీసుకుపోవడమే బహుజన్ సమాజ్ పార్టీ లక్ష్యమని సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కుల వెంకట్ , జిల్లా అధ్యక్షుడు కటికల ఓం ప్రకాష్ జిల్లా ఉపాధ్యక్షుడు ఈర్ల మల్లేశం ముదిరాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎనగందుల శంకర్ జిల్లా కార్యదర్శి కొండనోళ్ళ నరేష్ , జిల్లా ఈసీ మెంబర్ గజ్జల తిరుపతి మౌర్య సిద్దిపేట అసెంబ్లీ అధ్యక్షుడు పుల్లూరు ఉమేశ్ ,అసెంబ్లీ ఇన్చార్జి పంగబాబు , హుస్నాబాద్ అసెంబ్లీ అధ్యక్షుడు వేల్పుల రాజు ఇన్చార్జ్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్, దుబ్బాక అసెంబ్లీ అధ్యక్షుడు పోతారం రాజు, చార్జ్ మోత నర్సింలు, గజ్వేల్ అసెంబ్లీ అధ్యక్షుడు చంద్రం నాయకకులు సంపత్ , బాబు, ప్రసాద్, దెబ్బేట యాదగిరి, రవీందర్ , కిరణ్, నాగరాజు ఖాతా మహేష్ బాబు ఆశ ని కనక ప్రసాద యాదారి నర్సింలు స్థానిక బిఎస్పి నాయకులు పాల్గొన్నారు





