ముస్తాబాధ్, మార్చి 23 (24/7న్యూస్ ప్రతినిధి): బంధనల్, వెంకట్రావుపల్లె గ్రామాల్లో శనివారం సాయంత్రం వడగళ్ల వాన కురిసి బీభత్సం సృష్టించింది దెబ్బతిన్న వరిపంట పొలాలు ముస్తాబాద్ బిజెపి మండల అధ్యక్షులు అంజా గౌడ్ ఆధ్వర్యంలో బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి నష్టపోయిన రైతుల వరిపంట పొలాలను పరిశీలించారు. బాదిత రైతులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సుమారు 500 ఎకరాల్లో వరిపంట అపారనష్టం వాటిల్లింది వెను వెంటనే స్పందించి అన్నదాతలను ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం పంటనష్టం అంచనా వేశారు కాని నష్టపరిహారం గాలికి వదిలేసారన్నారు. గత రాష్ట్ర ప్రభుత్వంలాగే ఈ ప్రభుత్వం కూడా ఫసల్ భీమా యోజన ఎందుకు అమలు చేయలేదని గోపి ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు రాజిరెడ్డి, మల్లారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి క్రాంతి కుమార్, సంతోష్ రెడ్డి, మీస సంజీవ్, ఏళ్ల గిరిధర్, కరెడ్ల రమేష్ రెడ్డి, మేంగని మహేందర్, కోలా కృష్ణ గౌడ్, కస్తూరి నడిపి వెంకటరెడ్డి, దొంగల శంకర్ రెడ్డి, రాయం వెంకటేష్, బుచ్చెల్లి రాజయ్య, కస్తూరి బాపిరెడ్డి, నల్ల గోపాల్ రెడ్డి, నల్ల తిరుపతిరెడ్డి, గుడ్ల సురేష్, బొంగురం అజయ్, నల్ల రమేష్, చింతాకుల బాలమల్లు, దుబ్బాక గిరి, రాయం రాయమల్లు రైతులు తదితరులు పాల్గొన్నారు.
