ప్రాంతీయం

మద్యం సేవించి వాహనాలు నడపవద్దు…

33 Views

మద్యం సేవించి వాహనాలు నడపవద్దు…

-మద్యం సేవించి వాహనాన్ని నడిపిన ఒక వ్యక్తికి ఐదు (05) రోజుల జైలు శిక్ష…

సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 6, తెలుగు న్యూస్ 24/7

సిద్ధిపేట ట్రాఫిక్ సీఐ ప్రవీణ్, సిబ్బందితో గత కొన్ని రోజుల క్రితం పట్టణంలో పరిసర ప్రాంతాలలో వాహనాలు తనిఖీ చేయగా తొమ్మిది మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతుండగా పట్టుకొని బ్రీత్ ఎనలైజర్ తో తనిఖీ చేయగా మద్యం సేవించి ఉన్నారని రిపోర్టు రాగా శుక్రవారం సిద్ధిపేట స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కాంతారావు, న్యాయమూర్తి, ముందు హాజరుపరచగా విచారణ చేసి 09 తొమ్మిది మందికి రూ.81,500/- జరిమానా , ఒక వ్యక్తికి ఐదు (05) రోజులు జైలు శిక్ష విధించారు.డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన ఇద్దరు వ్యక్తులు కి ఒక్కొక్కరికి రూ. 5,000/- చొప్పున మొత్తం రూ. 10,000/- జరిమాన.జైలు శిక్ష విధించిన వ్యక్తి వివరాలు.మద్దెల మహేష్ బాబు, వయసు 32 , వృత్తి. టైల్స్ వర్క్ నివాసం అంబేద్కర్ నగర్ సిద్ధిపేట పట్టణం.ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ ప్రవీణ్ మాట్లాడుతూ.రోడ్డు ప్రమాదాల నివారణ గురించి మద్యం సేవించి వాహనాలు నడిపేవాళ్లనికట్టడిచేయడానికి, ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించడం జరుగుతుందన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల వాళ్ల కి ప్రమాదం రోడ్డుపై వెళ్లే ఇతర వాహనదారులకు కూడా ప్రమాదమనిప్రమాదాల నివారణ గురించి మాత్రమే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించడంజరుగుతుందన్నారు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో పట్టుబడిన వాళ్ల ని కోర్టులో హాజరు పరచగా మెజిస్ట్రేట్ విచారణ జరిపి 10 వేలరూపాయలజరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు.పదివేలరూపాయలు కట్టడం వల్ల మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, ప్రజల్లో వాహనదారుల్లో అవగాహన రావడం జరుగుతుందన్నారు.డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దని సూచించారు నడిపినచో ఒక్కొక్కరికి 5000/- రూపాయల జరిమానా విధించడంజరుగుతుందన్నారు.రోడ్డు ప్రమాదాల నివారణ గురించి మాత్రమే ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్, టెస్ట్ నిర్వహించడం జరుగుతుందన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *