సిద్దిపేట జిల్లా డిసెంబర్ 6
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో బుదవారం డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా ఎస్సీ కాలనీలో అంబేద్కర్ విగ్రహానికి అంబేద్కర్ యూత్ సభ్యుల అధ్వర్యంలో సామాజిక కార్యకర్త బాలకృష్ణ గౌడ్ పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారానే తెలంగాణ రాష్ట్ర కళ సహకారం అయిందని అక్షరాస్యతతోనే అన్ని సాధ్యమని అంబేద్కర్ చూపిన బాటలో ప్రతి ఒక్కరు పయనించాలని వారి ఆశయ సాధనకు పునర్ అంకితం అవ్వాలని ఆకాంక్షించారు.





