మంచిర్యాల జిల్లా.
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు – ఎమ్మెల్సీ అంజి రెడ్డి
ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజి రెడ్డి కి ఈరోజు మంచిర్యాల పట్టణం స్థానిక సుచిత్ర ఇన్ లో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ మంచిర్యాల జిల్లా మాజీ అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి పాల్గొని జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ తో కలిసి అంజి రెడ్డి కి ఘనంగా సన్మానించడం జరిగింది.
ఈ సందర్భంగా అంజి రెడ్డి మాట్లాడుతూ బీజేపీ కార్యకర్తల కష్టం వల్లనే ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ మెదక్ పట్టభద్రుల మరియు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఘన విజయం సాధించింది అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను బీజేపీ శ్రేణులు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లారని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అన్ని స్థానాల్లో పోటీ చేసి గెలుపు కోసం ఇప్పటి నుండే కార్యకర్తలు కష్ట పడి కృషి చేయాలని అన్నారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు.
ఈ కార్యక్రమంలో దుర్గం అశోక్, అమరాజుల శ్రీదేవి, ముల్కాల్ల మల్లారెడ్డి, కొయ్యల ఎమాజీ, అరుముల్ల పోషం, పెద్దపల్లి పురుషోత్తం మరియు తదితరులు పాల్గొన్నారు.
