గ్రామాలను రక్షించే గ్రామ దేవతలకు గ్రామ ప్రజలు బోనాలు సమర్పించిన వడ్డేపల్లి గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. రాయపోలు మండల పరిధిలోని వడ్డేపల్లి గ్రామంలో గురువారం రాత్రి గ్రామస్తులు పోచమ్మ అమ్మవారికి బోనాలను అంగరంగ వైభవంగా సమర్పించారు. భక్తులు ముందుగా ధూప దీప నైవేద్యం గ్రామ దేవతకు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ బోనాల ఉత్సాహాలలో పోతరాజుల విన్యాసాలు ప్రజలను అలరించాయి. ఈసారి వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండి గ్రామం అభివృద్ధి చెందాలని గ్రామస్తులు కోరుకున్నారు. గ్రామ దేవతకు భక్తి శ్రద్ధలతో భక్తులు మొక్కలు చెల్లించుకున్నారు.
