మంచిర్యాల జిల్లా, మంచిర్యాల నియోజకవర్గం.
132 మందికి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు.
వేంపల్లి గ్రామంలోని పద్మావతి గార్డెన్లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం.
మంచిర్యాల జిల్లాలోని, మంచిర్యాల నియోజకవర్గంలో ఐదు మండలాలకు సంబంధించి సీఎం రిలీఫ్ ఫండ్, కల్యాణ లక్ష్మి మరియు షాది ముబారక్ చెక్కులు మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు చేతుల మీదుగా 132 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మేలు చేసేందుకు మరియు సంక్షేమ పథకాలు అందించడానికి, పథకాలు అమలు చేయడానికి పనిచేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు, డిసిసి జిల్లా అధ్యక్షురాలు సురేఖ, మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్, 5 మండలాలకు సంబంధించిన దండేపల్లి, లక్షేట్టిపేట్, హాజీపూర్, మంచిర్యాల మరియు నస్పూర్ ఎమ్మార్వోలు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, లబ్ధిదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
