ప్రాంతీయం

అకాల వర్షాలకు.. అపార నష్టం…

139 Views

ముస్తాబాద్ ఏప్రిల్ 19 (24/7న్యూస్ ప్రతినిధి) మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం ఈదురుగాలులతో కురిసిన అకాల వర్షానికి వరిధాన్యం తడిసి ముద్దయింది. కొనుగోళ్లకు ఆటంకం కలగడంతో పాటు చాలాచోట్ల కోతకు వచ్చిన వరిపంట దెబ్బతిన్నది. చేతికి వచ్చిన పంట వర్షంపాలు అవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాలవద్ద ఆరబోసిన వడ్లు తడిసిపోయాయి. ఉరుములు, మెరుపులు, ఓవైపు గాలులు మరోవైపు పిడుగు శబ్దాలకు అన్నదాతల ఆశలు ఆవిడైపోతున్నాయి. ధాన్యం విక్రయించే సమయంలో తడిసి ముద్దయి మొలకెత్తే అవకాశాలు ఉన్నాయని బోరు విలపిస్తున్నారు. చేసేదేమీలేక మా రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్