ప్రాంతీయం

మెరుగైన సమాజ నిర్మాణంలో జర్నలిస్టుల, పోలీసుల పాత్ర కీలకం

30 Views

— ఏసీపీ పురుషోత్తం రెడ్డి

సమాజంలో జరిగే అసాంఘిక కార్యకలాపాలు రూపుమాపే జర్నలిస్టులు బాధ్యతగల జర్నలిస్టులు ఆని మెరుగైన సమాజ నిర్మాణంలో జర్నలిస్టులు ,పోలీసుల పాత్ర కీలకమని గజ్వేల్ ఏసిపి పురుషోత్తం రెడ్డి అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ లోని ఏసిపి కార్యాలయంలో ఏసిపి పురుషోత్తం రెడ్డికి తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ డైరీ క్యాలెండర్ ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి అందించారు .ఈ సందర్భంగా ఏసిపి మాట్లాడుతూ సమాజంలో జరిగే ఆసాంఘిక కార్యకలాపాలను తమ దృష్టికి తీసుకురావాలని వాటిని రూపుమాపేందుకు పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. చట్టం పరిధిలో ప్రజలు పనిచేయాలని మద్యం మాదకద్రవ్యాలు పేకాట గొడవలు లాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు దూరంగా ఉండి మెరుగైన సమాజ నిర్మాణంలో పౌరులందరూ బాధ్యతగా ఉండాలని పిలుపునిచ్చారు. పోలీసులు రక్షణ కవచంగా నిరంతరం పనిచేస్తున్నారని దానికి జర్నలిస్టులో బాధ్యతగా సహకారం అందిస్తున్నారని తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరగకుండా జర్నలిస్టులు తమ దృష్టికి తీసుకువచ్చి మెరుగైన సమాజంలో తమ వంతు కృషి చేస్తున్నారని అభినందించారు. విద్యార్థిని విద్యార్థులు విద్యపై తమ దృష్టి సాధించి ఉన్నత లక్ష్యాలను ఛేదించాలని విద్యతోటే మెరుగైన సమాజానికి బాటలు పడతాయి అన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ మహేందర్ రెడ్డి జర్నలిస్ట్ లు గుడాల శేఖర్, ఎల్లం రాజు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్