– విద్యార్థులే ఉపాధ్యాయులైన వేల
సిద్దిపేట జిల్లా , మర్కుక్ మండల్ ఎంపీ. యుపి. ఎస్. శివ వెంకటాపూర్ పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించటం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కే.శంకర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఈ రోజు నుండి మీ జీవిత లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ లక్ష్యాన్ని సాధించే వరకు నిరంతరం శ్రమిస్తే తప్పకుండా విజయాన్ని అందుకోగలరు అని అన్నారు, అలాగే తల్లిదండ్రులకు సమాజానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు .అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ , తోటి విద్యను అభ్యసించాలని ఉన్నత శిఖరాలకు ఎదగాలని సూచించారు . స్వయం పరిపాలన దినోత్సవం లో భాగంగా కలెక్టర్గా సి.హెచ్ ఇందు , డీఈవోగా అజయ్ , ఎంఈఓ గా సి.హెచ్. కనక లక్ష్మి , ప్రధానోపాధ్యాయురాలుగా సిహెచ్ దీపిక , ఉపాధ్యాయులుగా కారుణ్య, వర్షిని,ఝాన్సీ, మైధిలి, శ్రావణి, కావ్య, మనోజు, కార్తీక్, విష్ణువర్ధన్ , పిఈటి అనిల్ అభిలాష్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు కొత్త నరసింహారెడ్డి,తుమ్మ కుమార్, మధు,ముత్తయ్య ,సృజన,పద్మజ, రమ్య తదితరులు పాల్గొనడం జరిగింది.
