ప్రాంతీయం

బండి సంజయ్ ని కలిసిన మంచిర్యాల బిజెపి నేతలు

58 Views

మంచిర్యాల జిల్లా.

బండి సంజయ్ ని కలిసిన మంచిర్యాల జిల్లా బిజెపి నేతలు.

ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నస్పూర్ ఎస్.ఐ బీజేపీ నాయకుల పై ప్రవర్తించిన తీరు పై మరియు పోలీసుల సమక్షంలో కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తల పై చేసిన దాడి గురించి ఈరోజు బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్  ఆధ్వర్యంలో కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ ని కలిసి ఘటన వివరాలు తెలుపడం జరిగింది. నస్పూర్ ఎస్.ఐ కమలాకర్ రావు పై చేయి చేసుకోవడమే కాకుండా దురుసుగా ప్రవర్తించారని మరియు పోలీసుల సమక్షంలో కాంగ్రెస్ గూండాలు బీజేపీ కార్యకర్తల పై రాళ్ల దాడి చేసినప్పటికీ పోలీసులు తిరిగి బీజేపీ కార్యకర్తల పై 4 కేసులు నమోదు చేశారని తెలుపడం జరిగింది. ఈ విషయం పై బండి సంజయ్  స్పందిస్తూ రామగుండం సీపీ తో మాట్లాడటం జరిగిందని అదే విధంగా రాష్ట్ర డీజీపీ తో కూడా మాట్లాడతానని తెలిపారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్