ప్రాంతీయం

ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం కావాలి – రఘునాథ్ వెరబెల్

28 Views

ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం కావాలి – రఘునాథ్ వెరబెల్లి.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మంచిర్యాల పట్టణంలోని అశోక్ రోడ్ ,హమలివాడ మరియు పాత మంచిర్యాలలో రఘునాథ్ వెరబెల్లి  పట్టభద్రుల ఓటర్లను కలిసి బీజేపీ అభ్యర్థి శ్ర అంజి రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరడం జరిగింది.

ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ ఈనెల 27 న జరిగే పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీ పట్టభద్రుల అభ్యర్థి అయిన చిన్నమైల్ అంజి రెడ్డి గారికి మరియు ఉపాధ్యాయుల అభ్యర్థి మల్క కొమురయ్య గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించారని కోరారు. కాంగ్రెస్ పార్టీ గత 14 నెలల నుండి ఇటు నిరుద్యోగుల యువతను 2 లక్షల ఉద్యోగాలు మరియు నిరుద్యోగ భృతి పేరుతో మోసం చేసిందని మండిపడ్డారు. అదే విధంగా అటు ఉపాధ్యాయులకు పెండింగ్ లో ఉన్న DA మరియు పీఆర్సీ అమలు చేయకుండా వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. రిటైర్ అవుతున్న ఉద్యోగులకు సరైన సమయంలో అందాల్సిన బెనిఫిట్స్ ఇవ్వకుండా వారిని కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. కవున్ పట్టభద్రులు మరియు ఉపాధ్యాయులు ఆలోచించి కాంగ్రెస్ ప్రతులు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అమిరిశెట్టి రాజు, వంగపల్లి వెంకటేశ్వర్ రావు, ముదాం మల్లేష్, బోయిని హరి కృష్ణ, బల్ల రవి, మేన సూరి, చిరంజీవి, రాజేందర్, తరుణ్ సింగ్, జగ్జీత్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్