ప్రాంతీయం

రాష్ట్రస్థాయి పోలీస్ గేమ్ స్పోర్ట్స్ లో రామగుండం పోలీస్ కమీషనరేట్ మూడవ స్థానం

39 Views

*రామగుండం పోలీస్ కమిషనరేట్*

రాష్ట్రస్థాయి పోలీస్ గేమ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లో ఓవరాల్ ఛాంపియన్‌షిప్ లో రామగుండం పోలీస్ కమీషనరేట్ మూడవ స్థానం.

కాళేశ్వరం జోన్ పరిధిలో మొత్తం గోల్డ్ మెడల్స్-16, సిల్వర్ మెడల్స్- 24, బ్రాంచ్ మెడల్స్..32, మొత్తం మెడల్స్ -73.

*3వ తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్-2025 లో పతకాలు సాధించిన కాళేశ్వరం జోన్ పోలీస్ సిబ్బందిని అభినందించిన పోలీస్ కమీషనర్ .

కరీంనగర్‌లో జరిగిన 3వ తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్-2025 జనవరి 28 నుండి ఫిబ్రవరి 1 వరకు జరిగిన ఈ క్రీడల్లో కాళేశ్వరం జోన్ కి చెందిన క్రీడాకారులు *రామగుండం కమీషనరేట్ గోల్డ్ మెడల్ 11,సిల్వర్ మెడల్స్ 15,కాంస్య పతాకాలు -21 మొత్తం – 48.

ములుగు జిల్లా క్రీడాకారులు గోల్డ్ మెడల్స్..3, సిల్వర్ మెడల్స్.. 5, బ్రాంచ్ మెడల్స్ 5 — మొత్తం 13.

కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా క్రీడాకారులు గోల్డ్ మెడల్స్ 1, సిల్వర్ — 3 మొత్తం 4.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా క్రీడాకారులు గోల్డ్ మెడల్- 1, సిల్వర్ మెడల్స్-4, బ్రాంచ్ మెడల్స్ – 3 మొత్తం- 8* సాధించారు. ఈ సందర్భంగా పతకాలు సాధించిన పోలీస్ క్రీడాకారులు రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి గారు సీపీ గారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా సీపీ .. కాళేశ్వరం జోన్ తరపున ప్రాతినిధ్యం వహించి రాష్ట్ర స్థాయిలో ఉత్తిమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో పతకాలు సాధించినందుకు ముందుగా క్రీడాకారులకు అభినందనలు తెలియజేశారు. ఇదే స్పూర్తిని కనబరుస్తూ రాబోయే రోజుల్లో జాతీయస్థాయిలో రాణించి కాళేశ్వరం జోన్ మరియు రామగుండం పోలీస్ కమీషనరేట్ కు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అనంతరం బ పతకాలు తకాలి గెలుచుకున్న క్రీడాకారులను అభినందనలు తెలపడం జరిగింది.

ఈ కార్యక్రమంలో అదనపు డిసిపి అడ్మిన్ సి.రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, ఇన్స్పెక్టర్ లు అజయ్ బాబు, కృష్ణ, రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు దామోదర్, మల్లేశం , సంపత్, సీసీ హరీష్, పతకాలు సాధించిన క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్