Breaking News

ఆర్టీసీ బస్సు ప్రమాదం క్షతగాత్రులను పరామర్శించిన కలెక్టర్

61 Views

మెరుగైన వైద్యం అందించాలి

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

క్షతగాత్రులను పరామర్శించిన కలెక్టర్

రాజన్న సిరిసిల్ల, జనవరి -31

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.
గంభీరావుపేట మండలం గోరంటల గ్రామ శివారులో కామారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు సిరిసిల్లకి వస్తుండగా , గోరంటాల బ్రిడ్జి మూలం వద్దకు రాగానే బ్రేకులు ఫెయిలై ఎదురుగా ఉన్న పొలంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు గాయాలు కాగా, సిరిసిల్ల లోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి( జీజీహెచ్) కు తరలించారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ ఆసుపత్రికి చేరుకుని, క్షతగాత్రులను పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7