మంచిర్యాల జిల్లా.
కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజు ఆదేశానుసారము,జాతీయ కుష్టు నిర్మూలన కార్యక్రమము స్పర్శ అవగాహన కార్యక్రమాల కోసం ఈనెల 30వ తారీకు నుండి ఫిబ్రవరి 13వ తారీకు వరకు జిల్లాలో అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది ఇందులో భాగంగా ఈరోజు ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో మంచిర్యాలలో అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో డాక్టర్ సుధాకర్ నాయక్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఎస్ అనిత ఉపవైద్యాధికారి ప్రిన్సిపల్ నర్సింగ్ కళాశాల ట్యూటర్స్ విద్యార్థులు మరియు వెంకటేశ్వర్లు మూర్తి సిహెచ్ఓ నాందేవ్ పద్మ పర్యవేక్షకులు ప్రశాంతి మరియు స్వామి పర్యవేక్షకులు బుక్ వెంకటేశ్వర జిల్లా మాస్ మీడియా అధికారి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లాలో కుష్టు వ్యాధి నిర్మూలన కోసం కుష్టి వ్యాధి పైన అవగాహన కార్యక్రమాలు చేయడం జరుగుతున్నదని ఈ కార్యక్రమాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు వారి వారి పరిధిలోని పాఠశాలల్లో కాలేజీలలో అంగన్వాడీ కేంద్రాలలో ఏర్పాటు చేసుకోవాలని మరియు వైద్య విద్య ఐసిడిఎస్ సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు చేపట్టి కుష్టి వ్యాధి రోగులను గుర్తించాలని ఆదేశించినారు అదేవిధంగా మన జిల్లాలో కుష్టి వ్యాధి పైన అవగాహన కలిగించడానికి ప్రతి గ్రామంలో ఉండే 663 ఆశా కార్యకర్తలు వైద్య సిబ్బంది అంగన్వాడీ కార్యకర్తలు పర్యవేక్షకులు సుప్రవైజర్లతో కల్పిస్తున్నట్లు తెలియజేసినారు కుష్టు వ్యాధి పైన ప్రభుత్వము అందించిన ప్రతిజ్ఞను చేయించడం జరిగినది అందువలన మన జిల్లాలో ఉన్న పౌరులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఎలాంటి మచ్చలు ఉన్న చూయించుకోవాలని కోరినారు ప్రభుత్వపరంగా కుష్వ్యాధికి అవగాహనతో పాటు మందులను ఇవ్వడం జరుగుచున్నది కావున ప్రజలందరూ ఈ అవకాశమును ఉపయోగించుకోగలరని కోరడమైనది ముఖ్యంగా కుష్టి వ్యాధి 2027 వ సంవత్సరం నాటికి దేశంలో నుండి నిర్మూలన చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కోరినారు కుష్టు వ్యాధి మన జీవితంలో సామాజికంగా మానసికంగా కృంగదీస్తుంది కావున మనకు సమాజంతో మంచిగా మసులుకోవాలని ఆదేశించినారు.
ఈ కార్యక్రమాలను విజయవంతంగా చేయాలని జిల్లా కుష్టు వ్యాధి ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సుధాకర్ నాయక్ మరియు డిపిఎమ్ఓ రాఘవయ్య తెలియజేసినారు, ఈ కార్యక్రమంలో నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీమతి సుజాత మేడం మరియు లెక్చరర్లు విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు.





