*రామగుండం పోలీస్ కమిషనరేట్*
యాక్సిడెంట్ లపై అవగాహనలో భాగంగా హెల్మెట్ ల పంపిణి.
ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ భారం కాదు భద్రత.
బైక్ ఫై హెల్మెట్ ఫ్యామిలీ..సేఫ్ ఫ్యామిలీ : పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ భారం కాదు భద్రత అని రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజీ అన్నారు.
జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు సందర్బంగా హెల్మెట్‌తో ప్రాణానికి భద్రత అని అవగాహనా కల్పిస్తూ మంచిర్యాల పట్టణం లో మంచిర్యాల ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో మహిళకు, సీనియర్ సిటిజన్స్, మున్సిపల్ సిబ్బంది కి 150 హెల్మెట్ లను పంపిణి చేయడం జరిగింది.
ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ…ఏదో ఒక రకంగా యాక్సిడెంట్ కు గురై ద్విచక్ర వాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే, ఇలా చనిపోతున్నవారిలో ఎక్కువగా హెల్మెట్ లేకుండా ప్రయాణించేవారే అని బైక్ నడిపే వ్యక్తితో పాటు పిలియన్ రైడర్(వెనుక కూర్చునే వ్యక్తి)కి కూడా కచ్చితంగా హెల్మెట్ ఉండాలని సూచించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు సేఫ్టీ, రోడ్డు ప్రమాదాల నివారణపై స్కూల్స్, కళాశాల, ప్రజలకు, డ్రైవర్స్ కు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అని అన్నారు. వాహనాల తనిఖీ సమయం లో వాహనదారులను నిలిపి హెల్మెట్ వలన ఉపయోగాలు, ద్విచక్ర వాహనదారు లు హెల్మెట్ ధరించాలని, కార్లు నడిపే ప్రతీ ఒక్కరూ సీటు బెల్టు ధరించాలని సూచిస్తూ లేదంటే జరిమానా చెల్లించాల్సి ఉంటుందని తెలియచేయడం జరుగుతుంది అన్నారు. ద్విచక్ర వాహనదారులు సురక్షితంగా ఇంటికి వెళ్లడమే ప్రధాన ధ్యేయంగా భావించాలని, తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం ద్వారా ఆకస్మికంగా ప్రమాదం జరిగినపుడు ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చని అన్నారు. వాహనదారులు వేగాన్ని నియంత్రించుకుంటూ సురక్షితంగా ప్రయాణించాలన్నారు. ద్విచక్ర వాహనదారులు నిర్లక్ష్యంగా ప్రయాణించకుండా సురక్షితంగా ఇంటికి చేరడం వలన ఇంటిల్లిపాదీ ఆనందంగా ఉంటారని అన్నారు. ప్రాణం విలువ తెలుసుకొని ప్రయాణించాలని కోరారు.
హెల్మెట్ స్పాన్సర్ చేసిన ట్రస్మా డిస్ట్రిక్ట్ అధ్యక్షుడు ఎం డి అజీజ్ (తవక్కల్ పాఠశాల), ట్రస్మ మంచిర్యాల పట్టణ అధ్యక్షులు కొమ్ము దుర్గాప్రసాద్, ట్రస్మా డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్, ఎం డి ఉస్మాన్ పాషా రైసింగ్ సన్ పాఠశాల, ట్రస్మ మందమర్రి జనరల్ సెక్రటరీ శ్రీమతి లత శ్రీ, మంచిర్యాల కళాశాలల ప్రెసిడెంట్ రమణ గారులను సీపీ శాలువ తో సత్కారించి అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల డిసిపి ఏ భాస్కర్ ఐపీఎస్., మంచిర్యాల ఎ సి పి ఆర్ ప్రకాష్, ట్రాఫిక్ ఏసిపి జాడి నరసింహులు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, మంచిర్యాల పట్టణ ఇన్స్పెక్టర్ ప్రమోదరావు, మంచిర్యాల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్, ఎస్ఐ లు తదితరులు పాల్గొన్నారు.





