తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిని కలిసిన జర్నలిస్ట్ శ్రీకాంత్ చారి
సిద్దిపేట జిల్లా మర్కుక్ జూన్ 25
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను మంగళవారం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామం కెసిఆర్ వ్యవసాయ క్షేత్రంలో మర్యాద పూర్వకంగా కలిసిన జర్నలిస్ట్ శ్రీకాంత్ చారి.
అనంతరం శ్రీకాంత్ చారి మాట్లాడుతూ స్వరాష్ట్ర సాధన కోసం ఎంతో మంది కలలు కన్న తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రముఖ పాత్ర వహించి బంగారు తెలంగాణ గా మార్చడానికి ఎనలేని కృషి చేసిన మహనీయుడు కెసిఆర్ ని మర్యాద పూర్వకంగా కలవడం సంతోషంగా ఉందన్నారు.
