ప్రాంతీయం

సిద్దిపేట జేఏసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ముడవ రోజు రిలే నిరాహార దీక్ష

60 Views

తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కన్వర్షన్ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సిద్దిపేట జేఏసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ముడవ రోజు రిలే నిరాహార దీక్ష

సిద్దిపేట జిల్లా జనవరి 22

తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కన్వర్షన్ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సిద్దిపేట జేఏసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ముడవ రోజు రిలే నిరాహార దీక్షలు, ఎస్సి ఆఫీసు విద్యుత్ భవన్ ముందు ప్రారంభించడం జరిగింది. ఈ రిలే నిరాహార దీక్షలను( యూ ఈ ఈ యూ, సి ఐ టి యు )జిల్లా అధ్యక్షుడు అశొక్, దండేసి ప్రారంభించడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్ రంగంలో కీలకంగా పనిచేస్తున్నటువంటి ఆర్టిజన్ కార్మికులను రెగ్యులర్ చేయడంలో తప్పేం లేదని దీని వల్ల సంస్థకు ఎలాంటి భారం కూడా పడదని ఆయన చెప్పడం జరిగింది. ఒకే రూల్స్ ఉండాలి కానీ శాశ్వత పనిలో ప్రదేశాలలో పర్మినెంట్ కార్మికులు ఉండాలని సుప్రీంకోర్టు కూడా రాజ్యాంగంలో చెప్పడం జరిగింది. అలాంటప్పుడు విద్యుత్ రంగంలో మాత్రం రెండు రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉండడం చాలా దారుణం అని వెంబడి స్టాండింగ్ ని రద్దుచేసి ఆర్టిజన్ కార్మికులందరికీ రెగ్యులర్ పోస్టులో కన్వర్షన్ ఇవ్వాలని అనే డిమాండ్ చేశారు. మీ సమస్య పరిష్కారం అయ్యేంతవరకు మీ వెన్నంటే ఉండి యూనియన్ మీకు మద్దతుగా ఉంటదని తెలియజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో టీవీ ఏసి జేఏసీ జిల్లా కో కన్వీనర్ పెర్క సందీప్, జిల్లా జాయింట్ సెక్రెటరీ రామగౌని రవికుమార్ , సోషల్ మీడియా కన్వీనర్ దూలం యాదగిరి గౌడ్ , మహిళా జేఏసీ నాయకురాలు వరలక్ష్మి, కవిత ,రేణుక, సరిత,జేఏసీ నాయకులు చెట్కురి సుధాకర్,విష్ణు,కిషన్ ,బండ్ల శ్రీను ,తదితరులు పాల్గొన్నారు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్