మంచిర్యాల జిల్లా:
జైపూర్ మండలంలోని వేలాలా గ్రామంలో నిర్వహించనున్న మహాశివ రాత్రి జాతర సందర్బంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, పలు శాఖల అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.
వేలాలా గట్టు మల్లన్న జాతరను ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించిన వివేక్ వెంకటస్వామి.జాతరకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.
కార్యక్రమంలో పాల్గొన్న మంచిర్యాల డీసీపీ, డీ ఎఫ్ ఓ, దేవాదాయ శాఖ అధికారులు, స్థానిక అధికారులు తదితరులు పాల్గొన్నారు.
వివేక్ కామెంట్స్.
మహా శివరాత్రి సందర్భంగా వేలాల గట్టు మల్లన్న జాతరను ఘనంగా నిర్వహించాలి.జాతరకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలి.ఈసారి జాతరకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు.అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి జాతరకు అన్ని ఏర్పాట్లు చేయాలి.ఈసారి వీఐపీ వాహనాలను గుట్ట పైకి పంపకూడదని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే. దేవుడి దర్శనానికి అందరూ సమానులే దేవుడి దగ్గర ఎవరూ వీఐపీలు కాదని తెలిపిన వివేక్ వెంకటస్వామి.జాతరకు వచ్చే భక్తులకు మంచి నీటి సౌకర్యం కల్పించి, టెంట్లు వేయాలని ఆదేశాలు జారీ చేసిన వివేక్.
