మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత
-బిఆర్ఎస్ నాయకులు నకిర్త ప్రభు
సిద్దిపేట జిల్లా గజ్వేల్, జనవరి 20
సిద్దిపేట జిల్లా , ములుగు మండలం,కొత్తూర్ గ్రామానికి చెందిన చింత ఎల్లమయ్య అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్నబిఆర్ఎస్ నాయకులు నకిర్త ప్రభు మృతుని కుటుంబాన్ని పరామర్శించి వారికి (5000) రూపాయల ఆర్థిక సాయం అందించడం జరిగింది. వీరి వెంట బిఆర్ఎస్ పార్టీ నాయకులు గుంటి రాము, కుమ్మరి పెంటయ్య ,లంబడి స్వామి, గుంటి ప్రభాకర్ ,కొట్రు నాగేష్, నకీర్త మల్లేష , కొట్రు ప్రభాకర్ , చింతల ప్రభాకర్ , నకిర్త నరసింహులు , గువ్వ బాబు , గువ్వ ఎల్లం , కర్రె మహేష , తుపాకుల జనార్ధన్ , బక్క విష్ణు తదితరులు ఉన్నారు.





