మంచిర్యాల జిల్లా.
ఆరోగ్య కార్యక్రమాలపై కళాకారుల చే అవగాహన కార్యక్రమం.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజు ఆదేశానుసారం తాళ్లపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని మ్యాదరి పేట్ తాళ్ల పెట్ లింగాపూర్ గ్రామాలలో జాతీయ ఆరోగ్య మిషిన్ మరియు ఆరోగ్య కార్యక్రమాల పైన కళాకారులచే అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగినది.
ఈ కార్యక్రమంలో డాక్టర్ క్రాంతికుమార్ వైద్యాధికారి కృపావరం పర్యవేక్షకులు వైద్య సిబ్బంది ఆశ ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ ఆయుష్మాన్ భవ ఆరోగ్య కేంద్రాలు వ్యాధులు అదుపులో ఉంచడానికి తీసుకోవలసిన చర్యలు అసంక్రమణ వ్యాధులైన బిపి, షుగర్, క్యాన్సర్లు ఇతర వ్యాధులు రాకుండా జీవన చేతిలో మార్పులు వ్యాయామం లోగా మరియు తొందరగా గుర్తించి పంతులు వాడటం సంక్రమణ వ్యాధులైన కీటక జనత వ్యాధులు మలేరియా డెంగ్యూ చికెన్ గునియా పైన అవగాహన కల్పించడం జరిగింది. అదే విధంగా జాతీయ క్షయ, కుష్టు వ్యాధి పైన అవగాహన కలిగించడం జరిగినది, అదేవిధంగా జిల్లాలో టీ హబ్ ద్వారా చేస్తున్న పరీక్షలు మరియు ఆసుపత్రుల్లో ప్రసవాలు సాధారణ ప్రసవాళ్ళు వాటిపైన అవగాహన కలిగిస్తున్నామని జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్ తెలియజేసినారు.





